ఎడపల్లి గ్రామ మున్నూరుకాపు సంఘం అధ్యక్షునిగా బర్దిపూర్ నర్సయ్య ఎన్నిక…. ఘనంగా సన్మానించిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు…తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను,బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా,అభివృద్ధికి కృషి చేస్తా…సంఘ నూతన అధ్యక్షుడు బర్దిపూర్ నర్సయ్య వెల్లడి…..

 

ఎడపల్లి,ఆగస్టు 31: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉదయం ఆరు తర్పల కుల సంఘాల పెద్దలు,సభ్యులు కలిసి సమావేశమయ్యారు.ఈ సమా వేశంలో మున్నూరు కాపు నూతన సంఘం కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎడపల్లి గ్రామ(ఆరు తర్పల) మున్నూరు కాపు సంఘం అధ్యక్షు డుగా బర్దిపూర్ నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు.ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు.ప్రతి మూడు నెలల కొకసారి(త్రైమాసిక) జనరల్ బాడీ సంఘం సమావేశం నిర్వహించాలని తీర్మాణించారు.మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన వివరాలు పెద్దలు వెల్లడించారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడుగా బర్దిపూర్ నర్సయ్య,ఎన్నిక కాగా,ప్రధాన కార్యదర్శులుగా శిరిశెట్టి సంతోష్,కంజరి అభినవ్, కోశాధికారిగా ఆకుల సంతో ష్,ఉపాధ్యక్షులుగా బర్దిపూర్ అశోక్,కటకం సుధాకర్, కళ సంతోష్,సహాయ కార్యదర్శులుగా కంజరి ఓం ప్రకాష్,న్యావనంది శ్రీకాంత్, ప్రచార కార్యదర్శిగా కె.శివ చైతన్య, సలహాదారులుగా నాయిడి పోతన్న,ఆకుల శ్రీనివాస్,బొబ్బిలి శ్రీనివాస్,భుజంగం లింగం,బర్దిపూర్ విఠల్,కటకం అరుణ్, లను ఎన్నుకున్నారు.ఈ సంద ర్బంగా మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు బర్దిపూర్ నర్సయ్య మాట్లాడుతూ..తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా,అప్పగించిన బాధ్యతల ను సక్రమంగా నిర్వర్థిస్తానని స్పష్టం చేశారు.మున్నూరు కాపులు రాజకీయంగా,సామాజికంగా,అన్నిరంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు.సంఘం పెద్దల,సభ్యుల అమూల్యమైన సలహాలు,సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తానని అన్నారు.ఇందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని తనకు అందించాలని అధ్యక్షుడు బర్దిపూర్ నర్సయ్య కోరారు..ఈ సమావేశంలో ఆయా మున్నూరు కాపు సంఘాల కుల పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.