ఎడపల్లి,సెప్టెంబర్ 7: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో వందేమాతారం గీతం తప్పనిసరిగా ఆలపించేలా చర్యలు తీసుకోవాలని ఎడపల్లి గ్రామ సర్పంచ్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచంద ర్ అధికారులను కోరారు.ఈ సందర్బంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ఎంపిడివో శంకర్ కు,మండల విద్యాశాఖ అధికారి శివలింగ్ గాలప్పకు వినతిపత్రం అందజేశారు..కేంద్ర ప్రభుత్వ అదేశానుసారం అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో వందేమాతరం గీతం మన దేశ భక్తి స్వరం అని,కావున వందేమాతరం గీతం తప్పనిసరిగా పాడేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని సర్పంచ్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్ కోరారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో వార్డు సభ్యులు బర్దిపూర్ విఠల్ తదితరులు ఉన్నారు.

