ప్రజాసామ్య బద్దంగా నిరసన తెలుపుతున్న బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేయడం దారుణం…. ఎడపల్లి సర్పంచ్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కండగట్ల రాంచందర్ విమర్శ…..

 

 

ఎడపల్లి,సెప్టెంబర్ 7: (ప్రజా గళం)

ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతున్న బిజెపి నాయకులు,కార్యకర్తలను ముందస్తు పేర పోలీసుల చేత అరెస్ట్ చేయడం దారుణమని ఎడపల్లి గ్రామ సర్పంచ్,బిజెపి నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కండగట్ల రాంచందర్ విమర్శించారు.సోమవారం ఉద యం ఎడపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్,జిల్లా ఉపా ధ్యక్షుడు,కందగట్ల రాంచందర్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లెపూల శ్రీనివాస్ లను ముందస్తుగా ఎస్ఐ ముత్యాల రమ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా రాంచందర్ మాట్లాడు తూ…శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్బంగా,ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యం లో శాంతియుతంగా,ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గు చేటని అన్నారు.15 వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం,సుమా రు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తూ,జిఓ.97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవితను కాలరాస్తోందని ఆరోపించారు.విద్యార్థి లోకాన్ని అడుగడున దగా చేస్తున్న కాంగ్రెస్ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా భాగ్యనగర్ లో నిరసన తెలపడానికి వెళ్తున్న తమను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.