ఎడపల్లి,సెప్టెంబర్ 7: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిం చారు.ఈ పాఠశాలలో గత 65 ఏళ్లుగా విద్యాబ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు అంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్రంలో మొదటి సారిగా 65 ఏళ్ల పైబడిన పూర్వవిద్యార్థులతో పాటు 2023 విద్యాసంవత్సరం వరకు విద్యాబ్యాసం చేసిన 65 బ్యాచ్ లకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులు ఒక చోట చేరి బాల్య స్మృతులను నెమరే సుకున్నారు.వారి స్నేహితులను,కలుసుకుంటూ,దశా బ్దాల తీపి గురుతులను నెమరేసుకున్నారు.గురువుల ను సైతం సన్మానించారు.పూర్వవిద్యార్థులను సన్మానిం చారు.గురువులకు జ్ఞాపికలను బహూకరించారు.ఒకే పాఠశాల..వేలాది మంది పూర్వ విద్యార్థులు..ఎన్నో దశాబ్దాల జ్ఞాపకాలు,కాలం మారినా చెదరని స్నేహబం ధాలకు ఏఆర్పీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికయింది.65 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం సభూతో నభవిష్యత్ గా చూపరులను ఆకట్టుకుంది.ఉద్యోగ, వ్యాపార, ఉపాధిరీత్యా ఎక్కడెక్కడో స్తిరపడిన వారంతా ఒక్కచో ట కలుసు కున్నారు.ఒకరికొకరు కుటుంబ యోగ క్షేమా లు అడిగి తెలుసుకొని తరగతి గదుల్లో గత మధుర స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఆరు పదుల జ్ఞాపకాల ను 65 ఏళ్ల పూర్వ విద్యార్ధులు నెమరేసుకున్నారు.ఒక విద్యాసంస్థ ప్రారంభమై 65 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 65 ఏళ్ల క్రితం నాటి క్లాస్మేట్స్ అంతా ఒకే వేదిక పైకి రావడం అనేది ఒక చారిత్రక మహోత్సవం.తలలు పండి.అనుభవాలు నిండిన వృద్ధాప్యంలో,శేష జీవితాన్ని గడుపుతున్న పాత మిత్రులు మళ్లీ బాల్యపు స్మృతుల్లోకి వెల్లి పండ గలా ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు.అనంత రం విద్యాబుద్ధులు నేర్చిన విశ్రాంతి ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సమ్మేళనం అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేవిదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.1959లో పీఆర్సీ క్యాంపు గ్రామంలో ఈ పాఠశాల ఏర్పాటైంది.తొలినాళ్లలో పరిమిత వసతులు, అరకొర వేతనాలతో ఉపాధ్యాయులు సేవలందించినా. విద్యాబోధనలో మాత్రం వెనుకడుగు వేయలేదు. అనంతరం పాఠశాల ఎయిడెడ్ పాఠశాలగా మారింది. తరగతులు దశలవారీగా విస్తరించి పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగింది. 2001లో పాఠశాల పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.బ్రాహ్మణపల్లి,వడ్డేపల్లి, అంబం(వై),దుబ్బా తండా,జైతాపూర్,జమలం,పెంటా కలాన్,భర్దిపూర్,భూలక్ష్మి క్యాంపు,పెగడపల్లి,సాటా పూర్,నీల క్యాంపు,కందకుర్తి,వీరన్నగుట్ట,ఎడపల్లి తదితర గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువు కున్నారు.తమ విద్యాబ్యాసానికి వేదికైన ఈ పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరడంతో పూర్వ విద్యార్థు లు తలాకొంత వేసుకొని.7 లక్షల రూపాయల ష్యయం తో భవనాన్ని పునర్నిర్మించి తమ పాఠశాలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా 65 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ అపూ ర్వ సమ్మేళనానికి అన్ని బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలుసు కుని..తరగతి గదుల జ్ఞాపకాలను తలుచుకుని,అప్పటి అల్లరి,ఆటలు,అనుబంధాలను మరోసారి గుర్తుచేసు కున్నారు.ఈ సమ్మేళనాన్ని విద్యార్థులు కోలాహలం, పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.అనంతరం నాటి గురువులను.పూర్వ విద్యార్థులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్ర మంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,కోశాధికారి రాజశేఖర్,రిటైర్డ్ జడ్జి హజార్ హుస్సేన్,రిటైర్డ్ జైలు సూపరిండెంట్ జహీరా బేగం.రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్రావు,ఆనంద్ రావు, కొమురయ్య,సుశీల, జయసాగర్,ఆమీర్ అమర్, రమేష్ అన్నగ్రేస్,గొల్ల సాయ రెడ్డి,రజిని,రమేష్,నరేందర్, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

