కందకుర్తి,యంచలో పుష్కర ఘాట్లు,రోడ్లు,ఆలయ అభి వృద్ధి పనులకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు…..

 

 

బోధన్ ప్రతినిధి,సెప్టెంబర్ 10: (ప్రజా గళం)

వచ్చే ఏడాది జూన్,జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహా దారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇందులో భాగంగా రెంజల్ మండలం కందకుర్తి,నవీపేట మండ లం యంచలో పుష్కర ఘాట్లు,రోడ్లు,ఆలయ అభివృద్ధి పనులకు నిజామాబాద్‌ కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు.భక్తుల రాకపోకలు,పార్కింగ్, తాగునీరు,పారిశుద్ధ్యం,విద్యుత్,వైద్యం,దుస్తులు మా ర్చుకునే గదులు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారి స్తున్నట్లు తెలిపారు.పనులను నాణ్యతా ప్రమాణాల తో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.