బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత లారీ డ్రైవర్‌పై కేసు నమోదు

 

బోధన్ ప్రతినిధి, సెప్టెంబర్ 11: (ప్రజా గళం)

బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నా రు.శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్‌తో వెళ్తున్న(టిఎస్ 16 యుబి 3690) నెంబర్ గల లారిని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు.

లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా,వాటికి సంబం ధించి ఎలాంటి అనుమతి పత్రాలు,రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకు న్నారు.అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగిం చగా,బియ్యాన్ని పరిశీలించి అవి పీడీఎస్ బియ్యంగా నిర్ధారించారు.మేడ్చల్ నుంచి బోధన్‌కు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ తెలిపారు.పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినా,నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.