ఎడపల్లిలోని వీర హనుమాన్ గణేష్ మండలికి నూతన శోభ యాత్ర రథంను విరాళం ఇచ్చిన బంజ లక్ష్మణ్ పటేల్….ప్రత్యేక పూజలు చేసి గణేష్ మండలి ఉత్సవ కమిటీకి అందజేసిన సర్పంచ్ రాంచందర్,సొసైటీ చైర్మ న్ మల్కారెడ్డి…ఉదారత చాటుకున్న బంజ లక్ష్మణ్…. అభినందించిన సర్పంచ్,సొసైటీ చైర్మన్,గ్రామస్తులు

 

ఎడపల్లి,సెప్టెంబర్ 15: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలో మానవత దృక్పధంతో సేవ తత్వం గల మనసున్న వ్యక్తి,తన చిన్ననాటి మిత్రుడు బంజ లక్ష్మణ్ పటేల్ శ్రీ వీర హనుమాన్ గణేష్ మండలి కి శోభ యాత్ర రథం అందించడం అభినందనీయం అని స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్ అన్నారు.

ఈ సందర్బంగా మంగళవారం గైనిమీద వీర హనుమా న్ మందిరం వద్ద బంజ లక్ష్మణ్ తల్లిదండ్రులు స్వర్గీయ బంజ నాగమ్మ,బంజ రాజప్ప పటేల్ జ్ఞాపకార్థం నూత న శోభ యాత్ర రథంను సర్పంచ్ రాంచందర్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు,సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డిల చేతుల మీదుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అందజేశారు.రథంకు పురోహితుల మంత్రోచ్చారణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సుమారు1.75 లక్షల రూపాయలు విలువ గల నూతన శోభ యాత్ర రథం వీర హనుమాన్ గణేష్ మండలి నిర్వాహకులకు బంజ లక్ష్మణ్ పటేల్ అందించడం సంతోషకరమని అన్నారు.గ్రామంలో సార్వజానిక్ గణేష్ మండలికి, నయాబాదిలో గల మహాలక్ష్మి మందిరంకు,అలాగే వీర హనుమాన్ గణేష్ మండలికి మొత్తం మూడు శోభ యాత్ర రథాలు ఉన్నాయని తెలిపారు.ఈ యొక్క రథాన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చినటువంటి బంజ లక్ష్మణ్,కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు,అష్ట శ్వర్యాలు,కలగాలని సర్పంచ్ భగవంతుడిని కోరారు. సొసైటీ చైర్మన్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోల మల్కారెడ్డి మాట్లాడుతూ.. బంజ లక్ష్మణ్ పటేల్ వీర హనుమాన్ ఉత్సవ కమిటీకి శోభ యాత్ర రథం విరాళంగా ఇవ్వడం అభినందనీయ మని అన్నారు.లక్ష 75 వేల రూపాయలు విలువగల నూతన శోభ యాత్ర రథాన్ని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇవ్వడం పట్ల వారికి,వారి కుటుంబ సభ్యులకు తాను, గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలు పుతున్నట్లు తెలిపారు.ఈ విధంగా సోదరా భావంతో,ప్రేమానురాగా లతో,ఒక మంచి ఉదారతను చాటుకున్నందున వారి కుటుంబ సభ్యులకు,ఉత్సవ కమిటీ సభ్యులకు,గ్రామ స్తులకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నట్లు మల్కారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బంజ పాప య్య,బంజ గణేష్,మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు మల్లెపూల శ్రీని వాస్,గుంజరి రాజు,కేసరి శంకర్ గౌడ్, నాయిడి పోతన్న,కళ్యాణ్ గౌడ్,సందీప్, జొగ్గరి మోహన్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.