నిజామాబాద్,సెప్టెంబర్ 15,ప్రజాగళం :
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 83 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ 7, అసిస్టెంట్ ప్రొఫెసర్ 51, ట్యూటర్ 15, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 6 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు స్వీకరించనున్నారు. పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల కార్యాలయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 22న ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. పోస్టుల ఎంపిక కోసం సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఖాళీల వివరాలు, వేతనం, అర్హతలు తదితర పూర్తి సమాచారం కోసం
వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

