విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రకృతి సంరక్షణ,సమాజ అభివృద్ధి జరగాలి…ఎడపల్లి మున్నూరు కాపు సంఘం పెద్దలు వెల్లడి…. మున్నూరు కాపు సంఘంలో కొలువు దీరిన గణ నాథుడు…

 

 

ఎడపల్లి,సెప్టెంబర్ 15: (ప్రజా గళం)

వినాయక చవితి సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రం లోని మున్నూరు కాపు ప్రధాన సంఘం(6 సంఘాలు) ఆధ్వర్యంలో గణ నాథుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రకృతి సంరక్షణ,సమాజ అభివృద్ధి జరగాలని సంఘం ప్రతినిధులు అన్నారు.మున్నూరు కాపు సంఘం కుల పెద్దలు స్థానిక వీర హనుమాన్ ఆలయం వద్ద నుండి గణపతి విగ్రహన్ని ఊరేగింపుగా ట్రాక్టర్ లో మున్నూరు కాపు సంఘంకు తీసుకెళ్లారు.యువతి యువకులు ఉత్సా హంగా కేరింతలు కొడుతూ,నృత్యాలు చేస్తూ గణపతి బొప్పా మోరియా,జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గణేష్ ఊరేగింపు కొనసాగింది.అనంతరం మున్నూరు కాపు పెద్ద సంఘంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.భక్తి శ్రద్దలతో గణనాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బర్దిపూర్ నర్సయ్య ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు కొనసాగుతాయి.ప్రతి రోజు గణపతి పూజ లు,భజనలు,భక్తి పాటలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమం లో బొబ్బిలి శ్రీనివాస్,ఆకుల సంతోష్,నాయిడి పోత న్న,శిరీశెట్టి సంతోష్,బర్దిపూర్ అశోక్,కటకం శంకర్, బర్దిపూర్ విఠల్,కటకం సుధాకర్,కటకం పెద్ద అబ్బన్న, కల శంకర్,కల శ్రీనివాస్,బర్దిపూర్ ప్రవీణ్,ఎర్రోల భాస్క ర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.