ఎడపల్లి,సెప్టెంబర్ 21: (ప్రజా గళం)
ఎడపల్లి గ్రామంలోని సొసైటీలో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం అయినా అధికారులు ఇంతవరకు రికవరికి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన రైతు మాల పెద్దులు అన్నా రు.ఎడపల్లి సొసైటీలో నిధులు దుర్వినియోగం పై విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ,మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు పెద్దులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా అయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 -15 నుండి 2024 -2025 వరకు వచ్చిన వడ్ల కమిషన్ సుమారు 2.కోట్ల 48.లక్షల 88 వేల 908 రూపాయలు తనకు లేక ద్వారా తెలిసిందని అన్నారు. ఇట్టి సమాచారాన్ని,సమాచార హక్కు చట్టం ద్వారా నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా పొందినట్లు అయన చెప్పారు.ఈ సమాచారాన్ని జనరల్ బాడిలో కానీ,పేప ర్ ప్రకటనకు సంవత్సరాల వారీగా న్యూస్ పేపర్ లో ప్రకటించినట్లు దాఖలాలు లేవని అన్నారు.ఈ డబ్బులు ఏ అకౌంట్ లో వేసి డ్రా చేసినారో అట్టి సమాచారాన్ని కూడా తెలియజేయలేదని మాల పెద్దులు తెలిపారు.
అయితే ఇట్టి కమీషన్ డబ్బుల్లో అవకతవకలు జరిగినా యని తన అభియోగం అని పేర్కొన్నారు.ఇదే సొసైటీకి సంబంధించిన సేల్స్ మెన్ లు ఫర్టిలైజర్స్ విక్రయాల్లో కూడా సుమారు 30.లక్షల రూపాయలు వరకు అవకత వకలు జరిపినారని,పలు దినపత్రికల్లో న్యూస్ వచ్చిన ట్లు తెలిపారు.జిల్లా అధికారులు ఎడపల్లి పిఏసిఎస్ కు విచ్చేసి నిధులు దుర్వినియోగం కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రతినిధులకు తెలిపి నట్లు ఆయన చెప్పారు.ఈ సంఘటన జరిగి సుమారు 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు జిల్లా సహకార సం ఘం అధికారులు పిఏసిఎస్ పై చర్యలు తీసుకోలేదని అన్నారు.ఈ సందర్బంగా నిధులు అవకతవకలకు కారకులైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకొని,వారిపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయించి,నిరుపేద రైతులకు న్యాయం చేయాలని ప్రజావాణి లో అధికారు లకు అందించిన ఫిర్యాదు పత్రంలో మాల పెద్దులు కోరారు.

