ఎడపల్లి,సెప్టెంబర్ 16: (ప్రజా గళం)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టువంటి స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో సర్పంచ్ సుండు కిషన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ప్రజా పంపిణి ద్వారా పేదలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణి చేస్తోంది అని,ఇందులో ప్రధానంగా బియ్యం పేదలు లబ్ధిపొందుతున్నారాని సర్పంచ్ తెలిపారు.ప్రభుత్వం కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు తమ గ్రామానికి సుమారు 250 రేషన్ కార్డులు వచ్చాయాని అన్నారు.ఈ సందర్బంగా రేషన్ వినియోగదారులకు వారి పేర్ల ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేస్తామని సర్పంచ్ సుండు కిషన్ తెలిపారు.ఈ కార్య క్రమంలో ఉపసర్పంచ్ దినేష్ కుమార్,కార్యదర్శి గంగాధర్,జిపిఓ నర్సయ్య,బిఎల్ఓ వెంకగౌడ్,వార్డ్ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

