ఎడపల్లి,సెప్టెంబర్ 16: (ప్రజా గళం)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం ఎడపల్లి మండలం వడ్డెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రావు,సర్పంచ్ కొమ్మేటి సత్యం లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రజా పంపిణి ద్వారా పేదలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణి చేస్తోంది అని,ఇందులో ప్రధానంగా బియ్యం పేదలు లబ్ధిపొందుతున్నారాని సర్పంచ్ తెలిపారు.ప్రభుత్వం కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామానికి సుమారు 398 రేషన్ కార్డులు వచ్చాయాని అన్నారు. ఈ సందర్బంగా రేషన్ వినియోగదారులకు వారి పేర్ల ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేస్తామని వారు తెలిపారు.గ్రామంలో డ్రైనేజి ల కోసం మూడు లక్షలు మంజూరు చేయడం జరిగింది అని,గ్రామంలో రోడ్లు నిర్మాణానికి పెద్ద మొత్తంలో ఈజిఎస్ ద్వారా నిధులు మంజూరు అవుతున్నాయని,గొల్ల గుడిసెల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతామని అన్నారు.గత 10 సంవత్సరాలకు ముందు వై.యస్.రాజశేఖర్ రెడ్డి హయంలో ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప,మొన్నటి బిఆర్ఎస్ 10 సంవత్సరాల హయంలో పేదలకు రేషన్ కార్డులు పంపిణి చేయలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనీ పేదలకు అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అని,ప్రస్తు తం వాటి స్థానంలోనే కొత్తగా స్మార్ట్ కార్డులు పంపిణి చేస్తున్నట్లు అయన చెప్పారు.రెండు నెలల క్రితం 9 వేల కోట్ల రూపాయలు రైతుల బకాయిలు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.రైతు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించడం జరిగిందని,అలాగే పెట్టుబడి సహాయం 6 వేలు ఇవ్వడం జరిగింది అన్నారు.వచ్చే రోజుల్లో గ్రామానికి హ్యామ్ రోడ్లు మంజూరువుతున్నా యని,ఎంఎస్ సి ఫారం నుండి వడ్డెపల్లి వరకు,రోడ్డు నిర్మాణం చేపడుతారని,50 శాతం కేంద్ర ప్రభుత్వం,50 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని,15 సంవత్స రాల పాటు రోడ్డు మెయింటేనేన్స్ చేస్తారని అయన తెలిపారు.దాదాపు మండలంలో హ్యామ్ రోడ్లు నిర్మాణా నికి ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ద్వారా ప్రతి పాదనలు పెట్టడం జరిగింది అని అయన వెల్లడించా రు.అనంతరం పులి శ్రీనివాస్ రావుని సర్పంచ్ సత్యం శాలువ కప్పి,పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సీమా బేగం ఫెరోజ్, పంచాయతీ కార్యదర్శి సురేష్,ఆత్మ చైర్మన్ కృష్ణారావు, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటీ లింగం,జిపివో సంజీవ్,పాలవర్గ సభ్యులు,కారోబార్ గుణ తేజ,అంగన్ వాడి టీచర్లు దేవకుమారి,మైనవతి,షబానా,నాయకు లు సభావత్ రాములు,గోవింద్,అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

