ఎడపల్లి,సెప్టెంబర్ 21: (ప్రజా గళం)
తెలంగాణ సాధన కోసం తన పదవులను సైతం వదు లుకుని మలిదశ ఉద్యమానికి మార్గదర్శి అయిన పోరా ట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి గ్రామంలోని ఛత్రపతి శివాజి మహారాజ్ విగ్ర హం వద్ద స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వేడుకలు నిర్వహించారు.ఈ సంద ర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా స్థానిక సర్పం చ్ కందగట్ల రాంచందర్ మాట్లాడుతూ..నిరంకుశ నిజాం వ్యతిరేక,తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా,వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్27న జన్మించాడు అన్నారు.స్వాతంత్ర్యోద్యమంలో,నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు.1952లో ఆసిఫాబాదు నుంచిఎన్నికై హైదరాబాదు,ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహిం చాడు అని,ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా ఎన్ని కై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడని అన్నారు.నిఖార్సయిన తెలంగాణ వాది.తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త.1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడని సర్పంచ్ పేర్కొన్నారు.రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా అయన కృషిచేశాడని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ మచ్కురి గంగాధర్,సొసైటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంజ కామప్ప, ప్రతాప్ రెడ్డి,ఆర్.స్వామి గౌడ్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లెపూల శ్రీనివాస్, పద్మశాలి సంఘం ప్రతినిధులు అనీల్,అంబదాస్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

