నిజామాబాద్ క్రైమ్ సెప్టెంబర్ 19 (ప్రజాగళం )
గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పట్టికను పట్టుకున్నట్లు ఆర్ ఫీఎఫ్ సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
ఆపరేషన్ సత్కార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 2 వేల కిలోల నల్ల బెల్లం, 200 కిలోల పట్టిక పట్టుబడినట్లు తెలిపారు. రెండు కలిపి 35 సంచులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 2 వేల నల్ల బెల్లం విలువ రూ. 8లక్షలు, 200కిలోల పట్టిక రూ. 40 వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న నల్ల బెల్లం, పట్టికను నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఇందులో రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎక్సైజ్ అధికారులు ఉన్నారు.

