ప్రజాగళం, బాన్సువాడటౌన్, పారిశ్రామికవేత్త, భాస్కర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాన్సువాడకు చెందిన స్టోన్ క్రషర్స్ యజమాని భాస్కర్ రావు మృదు స్వభావి, స్నేహశీలిగా పేరుగాంచారు. శనివారం ఆయన జన్మదినం కావడంతో, మిత్ర బృందం, సన్నిహితులు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నసురుల్లాబాద్ మండలం దుర్కి సొసైటీ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హాజీపూర్ మాజీ సర్పంచ్ చంటి, మోహన్, రఘు తదితరులు పాల్గొన్నారు.

