నిజామాబాద్ సిటీ జూలై 29( ప్రజాగళం )
ఆర్టీసీ సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4వ తేదీన బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు
2013 నుండి పెండింగ్లో ఉన్నాయని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు చురుకుగా పాల్గొని అనేకమంది చనిపోయారన్నారు.
బతుకున్నప్పుడే రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఒక్కొక్కరికి పది నుండి పదిహేను లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు.ఆగస్టు మూడవ తేది వరకు తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 17వేల విశ్రాంత ఉద్యోగులు బస్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ మా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎంపీలను, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థలో పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరూతున్నామ్మన్నారు.
స్టేట్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ
సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.
వేతన సవరణ జరిగిన ఇప్పటివరకు డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి రామచందర్, కార్యదర్శి ఎస్ పోశెట్టి, కోశాధికారి సుదర్శన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎల్ నారాయణ, డి ఎస్ బి రాజు, జీవి చారి, ఆర్. నర్సింలు, జిల్లాలోని అన్ని డిపోల అధ్యక్షా కార్యదర్శులు పాల్గొన్నారు.

