ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయబాలికదినోత్సవం.

బాన్సువాడ టౌన్, ప్రజా గళం:

ఏ ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవంను నిర్వహించారు.ఈ సందర్బంగా ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ బాలికలకు పలు విషయాల్లో అవగాహన కల్పించారు. నేటి సమాజంలో బాలికల పట్ల వివక్ష, సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల వంటి విషయాలపై న అవగాహనా కల్పించారు.అదేవిధంగా ప్రస్తుతం మనదేశంఅభివృద్ధిలోదూసుకుపోతున్న,ఆడపిల్లలకు పోషకహారం, విద్య, వైద్య, సంరక్షణ, గౌరవం తదితర విషయాలలో వెనకబడి ఉన్నామన్నారు.ఇది మారాలంటే తల్లిదండ్రులలో మరియు సమాజంలో మార్పు మరింత అవసరమని అన్నారు.అడపిల్లలను బాగా చదివించాలని, అడ, మగ బేధం లేకుండా ఇద్దరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సాయి చరణ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.