ప్రతి బడ్జెట్ లో 20 వేల కోట్లు ఏవి..? దండి వెంకట్ బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.

 

ప్రజాగళం/నిజామాబాద్ ప్రతినిధి మార్చ్ 19:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని ఐదు సంవత్సరాల్లో బిసి కులాల ప్రజలకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించి బిసి కులాల ఆర్థిక, రాజకీయ సామాజిక సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు తిసుకుంటామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో ప్రకటించిన గత బడ్జెట్ లో 9 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేపర్ పై ప్రకటించినా బిసి కులాల కార్పొరేషన్ లకు నయా పైసా విడుదల చేయలేదని దండి వెంకట్ విమర్శించారు.

ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 11 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లుప్రకటించిన ఆచరణలో చిత్తశుద్ధి లో శూన్యమేనని తెలిపారు.

విద్య ,ఉపాధి, వైద్య అభివృద్ధి కోసం తగిన విధంగా నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.