బాన్సువాడ, మార్చ్ 20,ప్రజా గళం. బాన్సువాడ మండల కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం బి ఆర్ ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమావేశంలో బిఆర్ ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానూ రైతులకు చేయూతనియడం లేదని ఆరోపించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులకు బోనస్ ధర కల్పిస్తామని , మాటల్లో తప్ప చేతల్లో చూపించడం లేదన్నారు. నియోజకవర్గంలో పలు మండలాల్లో ఇప్పటి వరకు బోనస్ అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

