బాన్సువాడ రూరల్, ప్రజాగళం, డిసెంబర్ 12:
బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీమతి మంత్రి అంజవ్వ గణేష్ ను నూతనంగా నియమించడానికి సహకరించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన నివాసంలో నివాసంలో బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి,ధన్యవాదాలు తెలిపారు. ఆయనతోపాటు ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యల మంచిలి శ్రీనివాస్ రావు , గిరిజన విభాగ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంత్రి గణేష్ , మాజీ సొసైటీ చైర్మన్ మైలారం భాస్కర్ రెడ్డి, నాయకులుకమ్మసత్యనారాయణ అంజద్ ఖాన్ , బాన్సువాడ మండల యువ నాయకులు భాను తదితరులు ఉన్నారు.

