నిజామాబాద్ (ప్రజా గళం అర్బన్ న్యూస్):
SSA ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ వారికి మద్దతు తెలుపుతూ బైఠాయించి మాట్లాడారు ముఖ్యమంత్రి హామీ మేరకు మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, సి ఆర్ పి,mis కోఆర్డినేటర్లకు ఉద్యోగులు మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. SSA ఉద్యోగుల నిరాహార దీక్ష సమ్మె న్యాయ మైనదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు హైదరాబాద్ ముట్టడికి సిద్ధ మవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

