నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ‘ఓబీసీ ల పోరుబాట పుస్తక ఆవిష్కరణ*

నిజామాబాద్, జూన్ 12 (ప్రజా గళం)

నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ ల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి. ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ లు సంయుక్తంగా రచించిన ఈ పుస్తకం, ఈ నెల 14, న ఉదయం 10 గంటలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా ఆవిష్కరించబడుతుందని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాద్రి తెలిపారు.ది ఓబీసీ అప్రైజింగ్’: ఆరేళ్లపాటు సాగిన లోతైన పరిశోధన ఆరు రాష్ట్రాల్లో జరిపిన విస్తృత అధ్యయనం, నిశిత విశ్లేషణల ఫలితమే ఈ “ది ఓబీసీ అప్రైజింగ్” పుస్తకం. దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరిచారు రచయితలు ఆరు భారతీయ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక కార్యకర్తలు వంటి అనేక రంగాల ప్రముఖులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమానతలను, వాటి ఆధారంగా సామాజిక, రాజకీయ ఉద్యమాలను విశ్లేషించే సమగ్ర ప్రయత్నంగా ఈ పుస్తకం నిలుస్తుంది.ఈ పుస్తకం మొత్తం 9 విభాగాలుగా రూపొందించబడింది. ఇందులో బ్రిటిష్ పాలనలో కుల వృత్తులపై జరిగిన సామాజిక-ఆర్థిక దోపిడీ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. స్వాతంత్ర్యానంతరం ఓబీసీల స్థితిగతులు, వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంస్కరణలు, వాటి ప్రభావం, రిజర్వేషన్ల అమలులో ఎదురైన సవాళ్లు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉపాధి రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలను ఈ పుస్తకం లోతుగా విశ్లేషిస్తుంది. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి ఈ పుస్తకం ఒక సమగ్ర మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర పద్మశాలి అధ్యక్షులు పెంట దత్తాద్రి,, కార్యదర్శి చౌటు భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు, ఉపాధ్యక్షులు ఏనగందుల మురళి, దుబ్బ రాజాం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఏనుగందుల సుభాష్, బూస రవి, భూష శ్రీనివాస్, కస్తూరి గంగారాజ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.