అనుమానాస్పద స్థితిలో పార్ట్ టైం లెక్చరర్ మృతి.

బాన్సువాడ, జూన్ 21, ప్రజాగళం.

నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం లెక్చరర్ స్వప్న(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న మూడు సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం కోదాడ లోటెట్ఎగ్జామ్ రాసివచ్చి రాత్రి నైట్ డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకున్న ఆమె ఉదయం లేవలేకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్ కు సమాచారం ఇచ్చారు. బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా నాలుగుగంటల ముందే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Leave A Reply

Your email address will not be published.