నిజామాబాద్ డిసెంబర్ 31 ( ప్రజాగళం ).
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురు మందుబాబులకు జైలు శిక్ష విధించారు. వాహనాల తనిఖీలు భాగంగా 19 మంది వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. వారికి మంగళవారం ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జాన్ ఎదుట హాజరుపరచగా 14 మందికి 21,000 జరిమానా విధించారు. మిగిలిన ఐదుగురిలో వినాయక్ నగర్ కు చెందిన నరసింహారెడ్డి, సీతారాం నగర్ కాలనీ చెందిన జైపాల్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. నాగారంకు చెందిన అభిషేక్, కుర్నాపల్లి కి చెందిన పోశెట్టి, నగరంలోని హస్మి కాలనీకి చెందిన అఫ్రోజ్ లకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ నూర్జాన్ తీర్పు వెలువరించారు.
