నిజామాబాద్,జూలై 29, ప్రజాగళం:
రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ గా నిజామాబాద్ నగరానికి చెందిన అనుపమ సుబేదార్ ఎన్నిక అయ్యారు, ఇటీవల హైదరాబాద్ తాజ్ హోటల్ లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా35 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లకు సంబంధించిన ఇన్నర్ వీల్ క్లబ్ 22 క్లబ్ ల అధ్యక్షులు ఇతర 190 మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొనగా , ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ క్లబ్ ప్రధినిధులు సృజన,స్వందన ఆధ్వర్యంలో నిర్వహించగా క్లబ్ పద్మ శర్మ కన్వీనర్ గా కో కన్వీనర్ గా రమా దేవి ,ఉమ రాణి క్లబ్ అధ్యక్షులు లక్మీ మాధవి లత లు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ అనుపమ సుబేదార్ మాట్లాడుతూ నాపైన నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించడానికి మరింత బాధ్యతను పెంచిందని ప్రజల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా మహిళ సాధికార సాధించడం, ఆడపిల్లల విద్య పై ప్రత్యేక దృష్టి సాధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అనుపమసుబేదారి నియామకం పట్ల నిజామాబాద్ ఇన్నర్ మిల్క్ క్లబ్ అధ్యక్షురాలు సులక్షణ కార్యదర్శి ప్రసన్న పిడిసి శైలజ , స్వరూప రెడ్డి సౌందర్య రోటరీ క్లబ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు

