ప్రత్యేక ఓటరు జాబితా సవ రణలో బీఎల్ఏలు కీలకంగా పనిచేయాలి.. బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు.

 

బాన్సువాడ, జూలై 29, ప్రజాగళం.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితాసవరణకార్యక్రమాన్ని విజయవంతం చేయ డంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలక పాత్ర పోషించాలని భారతీ య జనతా పార్టీ జిల్లా అధ్య క్షులు నీలం చిన్నరాజులు పిలుపునిచ్చారు.బుధవారం బాన్సువాడ పట్టణంలో పార్టీ బీఎల్ఏ ఇన్‌చార్జిలతో నిర్వహించిన ప్రత్యేక సమా వేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నికల సంఘం నిర్వ హిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్ర మంలో అర్హులైన ప్రతి ఒక్క రి పేరును ఓటరు జాబితా లో నమోదు చేయించడం, వివరాల్లోని తప్పులను సరిదిద్దడం, కొత్తగా అర్హత పొందిన వారిని ఓటర్లుగా చేర్చడం వంటి అంశాల్లో బీఎల్ఏలు చురుకుగా పనిచేయాలనిసూచించారు.

ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకుని ఇప్పటివరకు సమర్పించని ప్రతి ఓటరిని గుర్తించి, వ్యక్తిగతంగా ఫారా లను పూర్తిగా నింపించి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేసేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. కేవలం ఫారాల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రతి ఫారం డిజి టలైజేషన్ జరిగిందా లేదా అన్న విషయాన్ని కూడా బీఎల్ఏలునిర్ధారించుకోవాలని సూచించారు.మరో నాలుగు రోజుల్లో ప్రత్యేక సవరణ కార్యక్రమం ముగి యనున్న నేపథ్యంలో గ్రామా ల్లో ప్రతి ఇంటికి వెళ్లి కొత్తగా అర్హత పొందిన ఓటరులను గుర్తించి వారి పేర్లు జాబితా లో నమోదు అయ్యేలా చూడాలని కోరారు. అలాగే ఇప్పటికే ఉన్న ఓటర్ల పేర్లు అనవసరంగా తొలగించ బడకుండా,ఎలాంటి తప్పు లు లేకుండా ఓటరు జాబి తా ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

100 శాతం ఓటరు జాబితా సవరణ పూర్తయ్యేలా ప్రతి బీఎల్ఏబాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్య క్షులు చిదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాశం భాస్కర్ రెడ్డి, భూమేష్, మండల నాయ కులు,బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.