ముధోల్ (ప్రజాగళం అర్బన్ న్యూస్)
ZPSS ముధోల్ బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపామని హెడ్మాస్టర్ కవిత మేడం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కష్టపడి చదివి ఆడపిల్లల చదువు కోసం విశేష కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళలోకానికి వన్నె తెచ్చారని, సమాజానికి దీక్షతో సేవలు అందజేసిన మహిళా మణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని కుమారి శ్లోక సావిత్రిబాయి పూలే వేషధారణతో ఉపన్యసించి పాటలు పాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు చక్కని పాటలు పాడరని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సహచర ఉపాధ్యాయులు కొక్కుల గంగాధర్ ను సన్మానించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాఇనులు పి కవిత, స్వర్ణలత విజయలక్ష్మి, అంజుమ్ పర్వీన్, నీరజ, షాహిదా పర్వీన్ , కవిత యాదవ్ తదితరులను శాలువాలతో పూల బోకే అందించి ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు.

