నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం అమృతపూర్ గ్రామానికి చెందిన కొట్టాల భవిష్య (ex ఆంధ్రభూమి విలేకరి చెలిమెల నరసయ్య మనుమరాలు)
శ్రీకృష్ణ నట రాజాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన 2వ భారత్ కల్చరల్ డాన్స్ ఫెస్టివల్ 2024 కొట్టాల భవిష్య మంచి ప్రతిభ కనబరచి బాల పురస్కారం అందుకుంది.

తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన డాన్స్ పోటీలలో 4వ తరగతికి చెందిన కొట్టాల భవిష్య బాల పురస్కారం అందుకోవడం పట్ల తల్లిదండ్రులు తాత అమ్మమ్మ హర్షం వ్యక్తం చేశారు.
చదువుతోపాటు నాట్యంలో రాణిస్తున్న భవిష్యను గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అభినందించారు.

