మహిళలకు ప్రెషర్ కుక్కర్ ల పంపిణీ

నిజామాబాద్ ( ప్రజాగళం అర్బన్)

శుక్రవారం స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో వివిధ సంస్థలలో పనిచేసే మహిళలకు ఉచితంగా ప్రెషర్ కుక్కర్ లను అందజేయడం జరిగిందని అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమము కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ కింద మహారాష్ట్ర పూణేకి చెందిన గేర్ వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ వారి సహకారం తో నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫౌండర్ సభ్యులు మదన్ లాల్ గుప్త పాల్గొని మాట్లాడారు. గత 70 సంవత్సరాలకు పైగా నిజామాబాద్ రోటరీ క్లబ్ దినదినాన సమాజంలో ప్రత్యక్షంగా పరోక్షంగా క్లబ్ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి సి ఎస్ ఆర్ ప్రోగ్రాం ల ద్వారా మహిళలలు లబ్ధి పొందడం అభినందించదగ్గ విషయమని అన్నారు.

కార్యక్రమంలో గేర్ వేర్ సంస్థకు చెందిన డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ గిల్డ, రోటరీ క్లబ్ సభ్యులు రమేష్ గిల్డా, కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, బాబురావు, జ్ఞాన ప్రకాష్, నర్సింగరావు, శ్రీరామ్ సోనీ , సతీష్ , జితేంద్రమలాని, గోవింద్ జవహర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.