నవీపేట్, జనవరి 04( ప్రజాగళం )
నవీపేట్ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. నవీపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేట్ మండలం, ఫకీరాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మణ్, గంగామణి దంపతులు తమ బైక్ పై వస్తుండగా ఎదురుగా అతివేగంతో వస్తున్న లారీ డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు.

