ప్రజాగళం క్యాలెండర్ ఆవిష్కరించిన మున్సిపల్ వైస్ చైర్మన్.

బాన్సువాడ టౌన్, ప్రజా గళం. ప్రజాగళం నూతన సంవత్సర క్యాలెండర్ ను తెరాస నాయకులు, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన వార్తలను ప్రచురించాలని, జర్నలిజానికి వన్నె తెచ్చే విధంగా విలేకరుల మసులుకోవాలని సూచించారు. ప్రజా గళం దినపత్రిక అనతి కాలంలోనే పాఠకుల మనసును దోచుకుందన్నారు. నిర్భయంగా నిజాయితీగా, వార్తలు ప్రచురించాలన్నారు. ప్రలోభాలకు గురి కాకుండా, వార్తలు రాసినప్పుడే విలేకరులకు మంచి పేరు వస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.