ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
ప్రజాపక్షం దినపత్రిక ప్రజల ఆదరాభిమానాలను చూర గొన్నదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ప్రజాపక్షం ప్రతినిధి కర్క రమేష్ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. వార్తాపత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అంటూ ప్రజా సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయన్నారు. జర్నలిస్టుల వల్లనే మారుమూల ప్రాంతాలలో ఉన్న సమస్యలు ప్రజా ప్రతినిధుల దృష్టికి వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపక్షం దినపత్రిక ప్రజలకు పనికొచ్చే వార్తలు కథనాలు రాస్తూ ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఇలాంటి పత్రికల వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసి, ప్రజలను చైతన్య పరుస్తాయన్నారు. ప్రజలకు ఉపయోగపడే మరెన్నో వార్తలు, కథనాలు రాయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, అదే ప్రవీణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ప్రజా పక్షం అర్బన్ రిపోర్టర్ ఉమా రావు, తాళ్ల శ్రీధర్, హైమథ్, కిషోర్ గౌడ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

