సావిత్రిబాయి పూలే ను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి షబ్బీర్ అలీ. కనిపించే దేవత సావిత్రి బాయి సావిత్రి బాయి పూలే అవార్డు నంది అవార్డు కంటే గొప్పది బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
సావిత్రిబాయి పూలే ను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.
ప్రతి మహిళ కు స్ఫూర్తి ఇచ్చిన కనిపించే దేవత సావిత్రి బాయి పూలే అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం
బీసీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పురస్కారాలు బీసీ టి యు జిల్లా అధ్యక్షులు వినోద్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో
పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 126 మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పురస్కారాలు
అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,
నగర మేయర్ నీతు కిరణ్, డిఈఓ అశోక్ , బిసిటియు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్,
పాల్గొన్నారు.
రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ..బీసీ కుల గణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంలో బీసీలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం జరిగిందన్నారు. బీసీ గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. ఉపాధ్యాయ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.

బీసీ కులాల్లో పుట్టినందుకు మనం గర్వపడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం సేవలందించిన
కనిపించే దేవత సావిత్రి బాయి పూలే అనీ, మహిళలకు చదువు లేదని గుర్తించి ఆనాడు
సావిత్రి బాయి పూలే కు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు.
భర్త నుంచి విద్య నేర్చుకుని ఈనాడు ప్రతి మహిళ చదువుకునేలా స్ఫూర్తి నింపిన సేవ మూర్తి సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు. గతంలో 80 శాతం బాలురు, 20 శాతం బాలికలు మాత్రమే చదువుకునే వారని, ప్రస్తుతం ఏ విద్యలో అయిన 60. శాతం బాలికలు, 40 శాతం బాలురు ఉంటున్నారని, ఇలా మహిళలు ఈరోజు చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రి బాయి పూలే లే అన్నారు. మహిళా శక్తి బలం మహిళలకు పూర్తిగా తెలియదని అది తెలుస్కుంటే
ప్రతి ఒక్కరు సావిత్రి బాయి పూలే లా గొప్ప వ్యక్తులు అవుతారని, మహిళలు తలుచుకుంటే ఇంటిని కాదు దేశాన్ని పాలించగలరని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానిగా సేవలు అందించారని,
మాయావతి అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్య మంత్రిగా పని చేశారని
గుర్తు చేశారు. అవార్డులు బాధ్యతను పెంచుతాయని, అవార్డులు తీసుకున్న ప్రతి మహిళ సావిత్రి బాయి అడుగు జాడల్లో నడుస్తూ, మహిళ విద్య కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. ఇందూరు గడ్డ కళాకారులకు, కవులకు, యోధులకు పుట్టినిల్లు అని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ కోసం జీవిస్తే ఇక్కడే నిలిచి పోతారని, సమాజం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. ఉద్యోగంలో చేరిన ఉద్యోగి, అదే ఉద్యోగంలో రిటైర్డు కావద్దు ఉన్నతంగా ఎదగాలని అన్నారు.సావిత్రి బాయి పూలే అవార్డు తీసుకున్న ప్రతి ఒకరు ఆమె సేవ, త్యాగం పది మందికి అర్థం అయ్యేలా వివరించాలన్నారు. బీసీలు అంటే
బ్రిలియంట్ క్లాస్ అని ఎవ్వరూ బీసీలు అని నిరాశ పడోద్దని అన్నారు. నిజామాబాద్ లో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. రెండు ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. ముఖ్య మంత్రి తో మాట్లాడి
పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.

*రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ*
సావిత్రి బాయి పులే ఉత్తమ అపాద్యాయురాలు పురస్కారం అందుకోవడం అభినందనీయం అని అన్నారు. సావిత్రి బాయి పూలే పేరును స్మరించుకుంటున్నామంటే వారు చేసిన సేవలు ఆదర్శనీయం అన్నారు. వారి జీవిత చరిత్రను చూస్తే వారు సమాజానికీ ఎలాంటి సేవలు చేశారో అర్థం అవుతుందన్నారు. వివక్షత ఉన్న ఆ రోజుల్లో విద్య వల్లనే అన్ని సాధించుకోవచ్చని గుర్తించడం జరిగిందన్నారు. సర్వరోగ నివారిణి అయిన విద్య ద్వారానే మహిళ సాధికారత లభిస్తుందని నమ్మి
వారు కృషి చేశారన్నారు.విద్య తోనే ఎదైన సాధించ వచ్చని నమ్మిన గొప్ప శక్తి సావిత్రి బాయి పులే అని గుర్తు చేశారు. ఈనాటి మహిళలు చదువుకొని ఉద్యోగాలు సాధించారంటే పురస్కారాలు పొందుతున్నారంటే సావిత్రిబాయి చేసిన కృషి కారణమన్నారు. సాయుధ పోరాటంలో పని చేసిన సాకలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పనిచేస్తుందన్నారు. స్వశక్తితో మహిళలు ఎదిగేలా స్కిల్ యూనివర్శిటీనీ ఏర్పాటు చేశామన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.

మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ.. మొట్ట మొదటి ఉపాధ్యాయురాలుగా పని చేసి, పాఠశాలను ఏర్పాటుకు కృషి చేసిన ఘనత సావిత్రి బాయి పూలే దే అన్నారు. గత ప్రభుత్వం పులే 1007 గురుకులాలు ప్రారంభించి, ఒక్కో విద్యార్థికి 1.20 వేలు ఖర్చు చేసిన ఘనత కెసిఅర్ దే అన్నారు.

*నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ*
సావిత్రి బాయి పూలే జయంతి రోజు మహిళ ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. బీసీ టియూ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మహిళ ఉద్యోగులను, ఉపాధ్యాయులకు నమస్కారాలు అందజేయడం అభినందనీయం అన్నారు. భర్త ద్వారా చదువు నేర్చుకొని స్ఫూర్తిని నింపుడం వల్లనే ఈనాడు ఎందరో మహిళలు చదువు నేర్చుకుని ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు అన్నారు. ఎన్నో కష్ట నష్టాలు వచ్చిన అందరి సహకారంతో 100 కు పైగా పాఠశాలలు స్థాపించి, సత్యశోధక్ పాఠశాలను నెలకొల్పడం గొప్ప విషయం అన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నుడా చైర్మన్ కేశవ వేణు, పి సి సి డిలీగేట్ శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు రత్నాకర్, యువ నాయకులు ఉమ్మాజి నరేష్, కరిపి రవీందర్, రవి కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, మోహన్, రామకృష్ణ, ఇన్ఫినిటీ రత్నాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.