*కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఓపెన్ మరియు 35 + మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహణ…
నిజామాబాద్, జనవరి 05: మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని . నిజామాబాద్ నగరంలోని కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో మెన్స్ డబుల్స్ ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025 క్రీడా పోటీలు నిర్వహించారు..ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 73 జట్లు పాల్గొన్నాయి.కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ నిర్వాహకులు కిరణ్,NGS సంతోష్ పోటీలను ప్రారంభించారు.అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ సీనియర్ క్రీడాకారులు పసుల అరవింద్, షాదుల్ల ఆధ్వర్యంలో బాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీ తో పాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణ మల్లన్న ,రాజు,శౌరబ్,విజయ్,శ్రీనివాస్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

