నిజామాబాద్( ప్రజాగళం అర్బన్):
842వ యజ్ఞం స్థానిక నాందేవ్ వాడలో గల శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ లో ప్రమోద్,నిధి జాజు దంపతుల ఫ్లాట్ నందు అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం 6 నుంచి ఏడు గంటల వరకు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఇందూరు యజ్ఞ సమితి నిజామాబాద్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మూడ నాగభూషణం గుప్త తెలిపారు.

నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఎంతో శుభదినం అని యజ్ఞం నిర్వహించిన వారి ఇంటి యందు వారి అపార్ట్మెంట్లో నివసించే వారి అందరికీ మేలు జరుగుతుందని దుఃఖాలు తొలగి సుఖశాంతులతో జీవిస్తారని అన్నారు. పూర్ణాహుతి అనంతరం యజ్ఞం పీటలపై కూర్చున్న ప్రమోద్ రాజు నిధి దంపతులకు శాలువాతో సన్మానించి బాసర అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రమోద్ జాజు వారి కుటుంబ సభ్యులు సుశీల జాజు, లక్షిత జాజు , విధాన్ జాజు, యజ్ఞ సమితి సభ్యులు చిటుకుల భూమయ్య గుప్త, సిహెచ్ ఈశ్వర్ చరణ్ గుప్త, డెమివార్ సంతోష్ కుమార్ అనిత దంపతులు ఆనంపల్లి రాజశేఖర్ గుప్త, మాధవరావు సత్యనారాయణ, రాజమౌళి మరియు అపార్ట్మెంట్ నందు నివసించే వాసులు పాల్గొన్నారు.

