బాపూజీ వచనాలయంలో అభివృద్ధి పేరిట నిధులు స్వాహా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ సాయి కుమార్.

నిజామాబాద్ జనవరి 5 ( ప్రజాగళం ప్రతినిధి)

సుదీర్ఘ చరిత్ర కలిగిన బాపుజీ వచనాలయం అభివృద్ధి పేరిట జరుగుతున్న నిధుల స్వాహా పై విచారణ జరపాలని పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర నడిబొడ్డున గల బాపూజీ వచనాలయంలో అవినీతి అక్రమాలు పెట్రేగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. లిక్కర్, కల్లు, సారా వ్యాపారులు బాపూజీ వచనాలయం పాలకవర్గంలో కొలువుదీరి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పుస్తక బండారంగా వెలుగొందుతున్న బాపూజీ వచనాలయం ప్రస్తుతం అవినీతిమయంగా మారిపోయిందన్నారు. ఈ బాపూజీ వచనాలయానికి కిరాయిలు, ఇతరత్రా దుకాణాల ద్వారా ఆదాయం సమకూరుతుoదన్నారు. గత ఎనిమిది దశాబ్దంగా జమ అయిన 80 లక్షల రూపాయలలో అవినీతి జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న అవినీతిని ఇకనైనా అరికట్టాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.దీనిపై ఇప్పటికే కలెక్టర్ కు, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశామని, సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు అయన తెలిపారు. విలేకరుల సమావేశంలో పరిరక్షణ పోరాట సమితి కో కన్వీనర్ బంగారు సాయిలు, భీమ్ రావు గైక్వాడ్,, కేశ్ పల్లి రవి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.