స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో సిసి రోడ్లు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమి పూజ నిర్వహించారు. శనివారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా,చిన్న ఎక్లారా గ్రామాలలో స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో సి.సి రోడ్డు పనుల కోసం భూమి పూజ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.చిన్న ఎక్లారా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చర్చ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతరావు దేశాయ్, సాయిలు, శ్రీనివాస్ పాటిల్, పరమేష్ పటేల్, మనోహర్ దేశాయ్, కొండ గంగాధర్, దేవదాస్ పటేల్, సంగ్రామ్ పటేల్, హనుమాన్లు స్వామి, విట్టల్ గురుజి, వెంకట పటేల్, కేశవరావు, బస్వంత్, మహేష్, గణేష్, అట్కర్ అంతు, గణేష్, మాదప్ప స్వామి, హనుమంతరావు, బోగేవార్ చందర్, జోలిగే సంద్రాము కార్యకర్తలు పాల్గొన్నారు.

