కళాశాల విద్యార్థుల కోసం క్రీడలు నిర్వహించడం అభినందనీయం. వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్. ప్రారంభించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు కొనసాగనున్న క్రికెట్ లీగ్.

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:

మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అలాంటి క్రికెట్ లీగ్ వెల్నెస్ హాస్పిటల్స్ నిర్వహించడం  అభినందనీయం అని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ ను ఎండి సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొదు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 24 టీమ్స్ పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి క్రికెట్ ను మొదటి రోజు అట్టహాసంగా
ప్రారంభించారు. బ్యాటింగ్ చేస్తూ
చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని గమనించి క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేసిన వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ను అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నామన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. ఈ క్రీడలలో పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారులకు హెల్త్ కార్డులు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, నిర్మల్ నుంచి వివిధ కళాశాలలు క్రికెట్ లో పాల్గొనడం చూస్తుంటే రాబోవు రోజుల్లో ఉమ్మడి జిల్లా నుంచి గొప్ప క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదుగుతారని నమ్మకం కలుగుతుందన్నారు.రాష్ట్రం ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. హైదరాబాదులో వెల్నెస్ హాస్పిటల్ ఎన్నో వైద్య సేవలు అందిస్తుందని, నిజామాబాదులో ఏడవ బ్రాంచ్ ను ను ఏప్రిల్ లో ప్రారంభించడం జిల్లా ప్రజలకు సువర్ణ అవకాశమన్నారు.

జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం రెండవ మ్యాచ్ ను రూరల్ ఎం అర్ ఓ నాగర్జున విచ్చేసి టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, క్లస్టర్ హెడ్ భార్గవ్, జిఎం మన్నె రాజేష్, వెన్నెస్ హాస్పిటల్ సిబ్బంది, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.