బాన్సువాడ టౌన్ ప్రజా గళం:
బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ, నసురుల్లబాద్, మోస్రా మండలాల లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందుకే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కుర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు ఆయా మండలాల అధికారులు, లబ్దిదారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

