బాన్సువాడ టౌన్, ప్రజాగళం. బాన్సువాడలోని సంగమేశ్వర్ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంగమేశ్వర కాలనీ నాయకుడు ఎం.డి యూనుస్ మాట్లాడుతూ సంగమేశ్వర కాలనీ ఏర్పాటై సుమారు 25 సంవత్సరాలు అవుతున్న 1500 కుటుంబాలు బతుకుతున్న ఇప్పటివరకు సంగమేశ్వర కాలనీలో పేద ప్రజల కోసం రేషన్ షాప్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతున్నాము కానీ ఇప్పటివరకు రేషన్ షాపు ఏర్పాటు చేయలేదన్నారు. సంగమేశ్వర కాలనీ లోని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంగమేశ్వర కాలనీ నివాసులు మతిన్ ,వాసిఫ్, ఇలియాస్, బాసిత్ , మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.

