అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

బాన్సువాడ, జనవరి 28 ,ప్రజాగళం టౌన్:

గణతంత్ర దినోత్సవం నాడు పంజాబ్ లోని అమృత్సర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మండలంలోని బోర్లాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమాన పరచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నల్లోల సాయిలు, ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్, మన్నె చిన్న సాయిలు, ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.