బాధిత రైతు పిర్యాదు ను పట్టించుకోని పోలీసులు. ఏటీఎంలో 30 వేలు పోగొట్టుకుని మూడు రోజులైనా నమోదు కాని కేసు.

నిజామాబాద్, ఫిబ్రవరి 04( ప్రజాగళం ప్రతినిధి )

నలుగురు నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా తయారయింది పోలీసుల పనితీరు. ఇప్పటికే పలు వివాదాల సుడిగుండంలో ఇరుక్కుని అప్రతిష్ట పాలవుతున్న పోలీసులు తమ ప్రవర్తనను మాత్రం మార్చుకోలేకపోతున్నారు. ఓ సామాన్య రైతు జిల్లా కేంద్రంలో ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద మోసానికి గురైన స్పందించకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపిస్తుంది. ఏటీఎంలో మోసం జరిగి మూడు రోజులైనా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. పోలీసుల పనితీరుపై బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల గంగారెడ్డి అనే రైతు తన
ఖాతాలో ఉన్న డబ్బులను తీసుకుందామని ఈ నెల ఒకటవ తారీఖున నగరంలోని ఎస్ బి ఐ ప్రధాన కార్యాలయం వద్దనున్న ఏటీఎం సెంటర్ కు చేరుకున్నారు. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసేందుకు అక్కడే ఉన్న ఒక వ్యక్తి సహాయం తీసుకున్నాడు. దీంతో అతను రైతు ఎటిఎం కార్డు ను మార్పు చేసి 30 వేలు డ్రా చేసుకొని మోసం చేశాడని రైతు గంగారెడ్డి ఒకటవ తేదీన పోలీసులకు సమాచారం అందించిన ఒకటో టౌన్ పోలీసులు పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న ఏటీఎం నుంచి అక్రమంగా డబ్బులు డ్రా కాగా, అదే రోజు పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించానని, ఎస్బిఐ అధికారులు ఎటిఎం సిసి పూటేజీ ని పోలీసులకు అందించారని సీసీ పూటేజీ లో ఉన్న వ్యక్తి నిజామాబాద్ కు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారన్నారు.,దీంతో పోలీసులు అతని ఇంటికి వెళ్ళి దొరకడం లేదని చెప్పడం విస్మయానికి గురిచేసిందని రైతు చిన్నోళ్ల గంగారెడ్డి వాపోయారు. మరోసారి బాధితుడు
మంగళవారం ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. నగర నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కార్యాలయల వద్ద సెక్యూరిటీ లేకుండా ఎటిఎం సెంటర్లు నిర్వహించడం పలు అనుమానాలకు తావీస్తుంది.

Leave A Reply

Your email address will not be published.