నవీపేట్, ఫిబ్రవరి 04( ప్రజాగళం )
నవిపేట మండలంలో రైతులకు రెండు లక్షలకు పైగా ఉన్న రుణాల పై ఉన్న రుణం కట్టకండి రెండు లక్షలు మేము మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని తక్షణమే 2 లక్షల రుణమాఫీని అందరు రైతులకు వర్తించేలా జీవో జారీ చేయాలనీ జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు సంజీవ్ అన్నారు.మంగళవారం జిల్లా జన చైతన్య వేదిక ఆద్వర్యంలో రైతులు మండల తహసీల్దారు వెంకటరమణకి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ రెండు లక్షల రైతు రుణమాఫీని అందరికీ అందించాలని, ఈ పథకాన్ని మధ్యలో ఆపేసి వరి పంటకు బోనస్ అని అదీ కూడ మధ్యలో ఆపేసి ఇప్పుడు రైతు భరోసా అని ప్రభుత్వం నాటకాలు అడుతున్నదని ఏద్దేవా చేశారు.రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మండలంలో దాదపు 70 శాతం రైతు రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం పై రోజు రోజుకూ నమ్మకంపోతుందని అన్నారు. వెంటనే రైతు రుణమాఫీని పూర్తి చేసి నమ్మకం నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సాటాపురం సాయిలు, కోస్లీ రాజు,హన్మంత్ రావు,అశోక్, వసంత్ రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

