నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 04(ప్రజాగళం )
బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా రెండవసారి నియమించినందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ధర్మపురి,రాజ్యసభ సభ్యులు డా.కే లక్ష్మణ్ లను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

