నిజామాబాద్ మార్చ్ 20 (ప్రజాగళం)
జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మతసామరస్యానికి ప్రతికగా హిందూ ముస్లింల ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో సోదర భావం పెంపొందించేలా కాదు తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి యోహాన్, ఆటో యూనియన్ లీగల్ సలహాదారు మాణిక్ రాజ్, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్,, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గబ్బర్, తదితరులు పాల్గొన్నారు.

