ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:
మహిళలకు, విద్యార్థినులకు కరాటే బ్రహ్మాస్త్రమని నమ్మి కరాటేలో శిక్షణ పొంది, జాతీయ స్థాయి కరాటేలో ఓ పేజీని లిఖించుకున్నది బ్రహ్మీణి.
కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించి విద్యార్థినులకు కరాటే కొచ్ గా పేరు గాంచి వెయ్యి మందికి పైగా విద్యార్థినికి కరాటే నేర్పించింది. లక్ష్యం సాధించాలంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన విజయం వైపు దుసుకుపోవాలని, పేద రికం అడ్డు కాదని నిరూపిస్తూ, ఎన్నో ఆకలి పస్తులు ఉంటూ అనుకున్న ధ్యేయం వైపు అడుగులు వేసింది. ఆమె ఎవరో కాదు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మ నగర్ కు చెందిన మెరుగు
వసంత -నర్సయ్య రెండవ కుమార్తె
మెరుగు
బ్రహ్మీణి కరాటే మాస్టర్ గా గుర్తింపు పొందారు. కరోనా సమయంలో తల్లి గుండె పోటుతో మరణిస్తే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన
ధైర్యం మాత్రం వీడ లేదు. అప్పటి నుంచి నాగారం లో పెద్దమ్మ వాళ్ళతో ఉంటూ శిక్షణ అందిస్తుంది. అన్నయ్య పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్న ధైర్యంగా చదువుకొని మహిళ లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏ రంగంలో అయినా ఎందులో మహిళలు తక్కువ కాదని అబ్బాయిలతో సమానంగా ఆటైన పాటైనా కరాటే అయినా దుమ్ము దులిపేస్తామంటూ విద్యార్థినిలకు తానే ఒక ధైర్యంగా నిలిచి కరాటే లో మంచి నైపుణ్యత

సాధించేలా శిక్షణ ఇస్తుంది. విద్యార్థినిలకు మెరుగు బంగారంలా కరాటే లో రాణించేలా కృషి చేస్తుంది. వేలాది మందికి కరాటే నేర్పిస్తూ ఆత్మ రక్షణను అయిన కరాటే పట్ల విద్యార్థినిలకు శ్రద్ధ వహించేల ఆసక్తి కల్పించేలా ఒక యజ్ఞం చేస్తుంది. కరాటే లో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ పేదింటి ఆడబిడ్డ అయిన బ్రహ్మీణి మరిన్ని విజయాల కోసం ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతుంది. 2007 లో 9 తరగతి చదువుతున్న సమయంలో కరాటే మాస్టర్ వినాయక్ రాజ్ వద్ద ఆత్మరక్షణ అయిన కరాటే లో కెరియర్ ప్రారంభించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మీణి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినిలకు కరాటే తరగతులలో శిక్షణ ఇస్తుంది. అయితే కుటుంబ నేపద్యం చూస్తే తల్లిదండ్రులు చనిపోయాక ఒంటరిగానే ఉంటున్న బ్రహ్మీణి పెద్దమ్మ వయసు మీద పడడంతో ఆమెతో కలిసి నాగారంలో నివసిస్తుంది. ఆమె కుటుంబం నేతన్న కుటుంబం. చాలీచాలని వేతనంతో కుటుంబ భారం భారంగా మారింది. కరాటే నేర్చుకొనే సమయంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి కరాటే పై దృష్టి సారించింది. ఒక వైపు శిక్షణ తరగతులు చెబుతూ చదువు పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం
పోటీ పరీక్షల నిమిత్తం సన్నద్ధమవుతోంది. ఆర్థిక పరిస్థితి బాగా లేక ఇంటి వద్దనే ఉండి ప్రిపేర్ అవుతుంది. అయితే కరాటేలో జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న ఆమె బ్లాక్ బెల్ట్ సాధించి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కొన్ని నెలలుగా పార్ట్ టైం శిక్షణ ఇస్తూ ఇచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవనం సాగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లోని క్రీడా విభాగం తనపై కొద్దిపాటి జాలి చూపిస్తే తన జీవితం బాగుంటుందని, ఎందరో జీవితాల్లో మెరుగులు దిద్దుతానని ఆశపడుతుంది. తనతో పాటు ఎంతో మంది విద్యార్థులను బ్లాక్ బెల్ట్ సాధించేలా శిక్షణ ఇస్తామని
కరాటే లో ఇంత మంచి టాలెంట్ ఉన్న కోచ్ బ్రహ్మీణి పట్ల ప్రభుత్వం ఆలోచించాలని స్థానికులు, పాఠశాలలో శిక్షణ ఇస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు కోరుతున్నారు.
*ఝాన్సి లక్ష్మి బాయి ఆత్మ రక్షణ స్కీమ్ ద్వారా శిక్షణ*
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థినిలకు కరాటే లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం
మూడు నెలల కోర్సు ను ప్రారంభించగా బాలికలకు ఝాన్సి లక్ష్మి బాయి ఆత్మ రక్షణ స్కీమ్ ద్వారా మూడు నెలల శిక్షణను
జిల్లాలోని పలు మండలాల్లో వివిధ ప్రభుత్వం పాఠశాలలో శిక్షణ ఇచ్చింది బ్రహ్మీని. మూడు నెలల కోర్స్ కు గానూ
ప్రతి నెలకు 5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తుంది ప్రభుత్వం. వారంలో మూడు రోజులు ఒక్క రోజు ఐదు పాఠశాలలో శిక్షణ ఇస్తూ విద్యార్థినిల ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుంది.
*కరాటే శిక్షణ ఇచ్చేందుకు బైక్ నేర్చుకొని*
ఝాన్సి లక్ష్మి బాయి ఆత్మ రక్షణ స్కీమ్ ద్వారా శిక్షణలో భాగంగా వర్ని, డిచ్ పల్లి, బోధన్ లాంటి ప్రాంతాల్లో కరాటే నేర్పించడానికి వెళ్లేందుకు సరైన బస్ సౌకర్యం అనుకున్న సమయానికి లేక పోవడంతో పాటు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డ బ్రహ్మీని బైక్ నేర్చుకొని బైక్ పై సమయానికి వెళ్ళేలా ప్రణాళికలు వేసుకుంది. అట్లాగే కరాటే లో శిక్షణ లో కూడా పొట్ట మీద నుంచి బైక్ తీసుకెళ్లే
(స్టమక్ కంట్రోలింగ్ ఈవెంట్) కోసం
2015 బైక్ నేర్చుకుంది. రోజు బైక్ పై వెళుతూ వస్తూ ఉన్న బ్రహ్మీణి ని చుట్టూ పక్కల వాళ్ళు వింతగా చూసిన సందర్బాలు లేక పోలేదని చెబుతుంది. ఏది ఏమైనా తాను అనుకున్న లక్ష్యం కోసం ఎన్ని ఆటు పొట్లు అయిన ఎదురిస్తానని, ఎన్ని అవమానాలు వచ్చిన భరిస్తానని చెబుతుంది.
*సాధించిన విజయాలు.. అవార్డులు*
👉2006 లో ఏపి ఇన్విటేషన్ కరాటే చాంపియన్ షిప్ సెకండ్ ప్లేస్.
👉2008 లో డిస్టిక్ట్ లెవెల్ కరాటే చాంపియన్ షిప్ మొదటి ప్లేస్
👉2008 లో చోట కాన్ కరాటే
కట లో మొదటి ప్లేస్.
👉2008 లో 21 వ చోటొ కాన్ నేషనల్ కరాటే చాంపియన్ షిప్ కట లో మూడవ ప్లేస్
👉2014 లో నేషనల్ సేవంత్ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే కుంపు నేషనల్ చాంపియన్ షిప్ మొదటి ప్లేస్.
👉2015 లో ఒకీనావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మొదటి ప్లేస్.
👉2016 లో 32 వ జాతీయ చోటో కాన్ కరాటే చాంపియన్ షిప్ లో సెకండ్ ప్లేస్ స్పరింగ్ కుమితే అందుకున్నారు.
👉2016 లో 32 వ జాతీయ చోటో కాన్ కరాటే చాంపియన్ షిప్ లో
కట లో ఫస్ట్ ప్లేస్.
👉2017 లో సెకండ్ తెలంగాణ స్టేట్ సీనియర్ కరాటే చాంపియన్ షిప్
కుమితే సెకండ్ ప్లేస్,
👉2017 లో జిల్లా కలెక్టర్ యోగీతా రాణ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం సందర్భంగా ప్రశంసలు,
👉2018 ఫస్ట్ ఆలిండియా నేషనల్ లెవెల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ టీం క్యాాటగిరిలో పాలోన్నారు.
👉2019 గోవాలో జరిగిన 4 వ ఇంటర్నేషనల్ కుంపు అండ్ కరాటే చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ సాధించారు.
👉2021 లో బ్లాక్ బెల్ట్ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా తీసుకున్నారు.
ఇవే కాక మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదిగా, జిల్లా కలెక్టర్ యోగితా రాణ లాంటి ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదిగా ప్రశంసలు అందుకుంది.
*విద్యాభ్యాసం*
2006 లో కామారెడ్డి విజ్ఞాన విద్యాలయం, 8 నుంచి 10 వ తరగతి వరకు నిజామాబాద్
లో గర్ల్స్ హై స్కూల్, ఇంటర్ ప్రభుత్వం బాలికల పాఠశాలలో 2009-11 చదివింది.
తండ్రి చనిపోవడంతో మద్యలో మానేసిన అనంతరం
డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2018 పూర్తి. చేసి, క్రీడల్లో మక్కువతో
2023 లో బీ పీ ఎడ్, బి వి కే కలశాల సిద్ది పెట్ లో పూర్తి చేసి
2024 లో డి ఎస్సీ రాయడం జరిగింది. ఒకటి రెండు మార్కులతో డి ఎస్సీ చేజారి పోవడంతో గ్రూప్ 2 కూడా రాసింది.
*జిల్లాలో శిక్షణ ఇచ్చిన పాఠశాలలు*
నిజామాబాద్ లోని గర్ల్స్ హై స్కూల్ ,బోర్గం స్కూల్, పోలీస్ లైన్, వాటర్ ట్యాంక్, ఖిల్లా స్కూల్, జడ్పీ ఎచ్ వాల్మీకి నగర్, డిచ్ పల్లి లోని ఉర్దూ మీడియం, కే జీ బీ వి, రాంపూర్ హై స్కూల్, వర్ని గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం, ఓల్డ్ వర్ని జడ్పీ ఎచ్ ఎస్, రుద్రుర్, సులేమాన్ ఫారం, కేజీ బీ వి, చందూరు, మోస్ర, ఎడపల్లి మండలంలోని జైత పూర్, ఉర్దూ మీడియం, ఏ అర్పి క్యాంప్,
రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి., వీరన్న గుట్ట, దూ పల్లి తో పాటు ప్రైవేట్ స్కూల్ చైతన్య హైస్కూల్, సెయింట్ జేవియర్స్,
పాఠశాలలో సైతం శిక్షణ ఇచ్చింది.
*ప్రభుత్వం ఉద్యోగం సాదిస్తా*
బ్రహ్మీణి కరాటే కోచ్
మహిళలు తలుచుకుంటే ఎదైన సాధిస్తారు. ఇంట్లో ఇంటి బయట ఎదైన ఆపద ఎదురైతే తమను తాము ఎలా రక్షించుకోవడం కోసం కరాటే గొప్ప సాదనం.
భవిష్యత్ లో పోలీస్ ఆఫీసర్ ను అవుతా. ఐపీఎస్ అధికారి
కిరణ్ బేడీ ఆదర్శం. ఆమె అంటే ఎంతో ఇష్టం. కిరణ్ బేడీ లా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను, అమెలా సేవలు అందించాలని
కానిస్టేబుల్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జాబ్ చేసుకుంటూ చదువుకోవడంతో అర్హత పరీక్షలో విజయం సాధించలేక పోయాను.
తప్పకుండా పోలీస్ జాబ్ సాధిస్తాను. సమాజానికి సేవ అందిస్తాను. తల్లిదండ్రులు చనిపోవడంతో అద్దె కు ఉంటున్నాము. టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాను. క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం నా లాంటి వారికి సహాయం చేయాలని కోరుతున్నాను. ఇల్లు లేక కిరాయి కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉద్యోగం వస్తె నా కాళ్ళ మీద నేను నిలబడతాను అన్న సంకల్పంతో గ్రూప్ 2 కూడా రాశాను. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధింస్తానన్న నమ్మకం ఉంది. ప్రతి పాఠశాలలో విద్యార్థినులకు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి కోర్స్ తప్పని సరి నేర్పించేలా చేస్తే మా లాంటి ఎంతో మంది కోచ్ లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

