నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్) :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
టి పి సి సి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తదితరుల ఆశీస్సులతో 58వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సీనియర్ మైనార్టీ నాయకులు M. A. కుద్దూస్ అధ్యక్షతన నగరంలోని బర్కత్పురా లో గల ఆల్ హమ్రా ఫంక్షన్ హాల్ నందు 51 డివిజన్ మరియు 58 డివిజన్ మైనార్టీలకు ఘనంగా ఇఫ్తార్ విందును

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎం ఏ కుద్దూస్ తెలిపారు. మౌలానా ఖదీర్ సాబ్ నమాజ్ పడకర్ సబ్ కో దువా కరే అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని కుద్దూస్ బాయ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సీనియర్ 58వ డివిజన్ కార్పొరేటర్ కుద్దూస్ తోపాటు నాయకులు అసద్ హందాన్, జావిద్ అక్రమ్, నరాల రత్నాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్సా, 51 డివిజన్ కాంగ్రెస్ మైనారిటీ లీడర్ హబీబ్ అల్కాఫ్, M. A. జలీల్, అబ్దుల్ పర్వీజ్ మరియు వందలాదిగా మైనార్టీ పెద్దలు పిల్లలు యువకులు పాల్గొని ఇఫ్తార్ దావత్ ను ఆనందంగా స్వీకరించారు.

