ప్రజాగళం/ నిజామాబాద్ ప్రతినిధి మార్చ్ 26:
ఆస్థిపన్ను వడ్డీ పై రాయితీ 90% కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ చేసిన సూచనకు మరుసటి రోజే స్పందించి జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పై 24 న అసెంబ్లీ సమావేశాలలో ఆస్థి పన్ను బకాయిల పై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఓ టి ఎస్ (వన్ టైం సెటిల్మెంట్) ద్వారా ఆస్తిపన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ కల్పిస్తూ, ఇచ్చిన వెసులుబాటు తెలంగాణలో ఉన్న 13 మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసారు.దీని ధ్వరా మున్సిపాల్ కార్పొరేషన్లు ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని సూచించిన డిమాండ్ కు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మునిసిపల్ కార్పొరేషన్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్థి పన్ను బకాయిల పై 90% వడ్డీ మీద రాయితీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని 25 తారీఖున రాత్రి జీఓ విడుదల చేసింది.
ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ దిలీప్ కుమార్ రాష్ట్ర ఉత్తర్వుల మేరకు 31 తారీకు లోపు కట్టే వారికీ ఆస్థి పన్ను వడ్డీ పై 90% వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటన విడుదల చేసారు.రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలందరు ఎదురుకుంటున్న సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్య పరిష్కారం అయ్యేల గళం వినిపించిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేసారు.

