ఆర్మూర్ ఏప్రిల్ 28 ప్రజాగళం రూరల్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్ట్, సమాజ సేవలో తనకంటూ సేవా భావంతో కలిగిన మనసున్న నాయకుడిగా గుర్తింపు పొందిన నరసింహ చారి బీసీ జేఏసీ అధ్యక్షుడుగా నియమకమైనందుకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టు వృత్తిని ఎంచుకొని పత్రిక పరంగా ప్రజలకు న్యాయం చేయగలిగిన జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు హోదాలో అనేక పోరాటం చేసిన గొప్ప నాయకుడని ఆర్మూర్ జర్నలిస్ట్ సంఘం నాయకులు అన్నారు. సోమవారం ఆర్మూర్ లోని ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావత్రి రాజశేఖర్ ,ఫౌండేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు, ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు మాట్లాడుతూ బీసీ జేఏసీ అధ్యక్షుడు హోదాలో బిసి ప్రజల హక్కులను కల్పించే విధంగా ఉద్యమ పోరాటాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారు ఆయనను కోరారు. ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్,గంగామోహన్ చక్రు,రాంప్రసాద్ ,రామచందర్ ,నూకల శేఖర్ , శ్రీకాంత్ గౌడ్,రమణ ఎలక్ట్రికల్ , క్రాంతి,పాల్గొన్నారు.

