అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి. పోచారం..

బాన్సువాడ, ఏప్రిల్ 30, ప్రజాగళం.

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, ఆ మహనీయుడు చేసిన సేవలు వెలకట్ట లేమని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచర్ల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతి ఒకరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు మండలప్రజాప్రతినిధులు, అంజిరెడ్డి, నర్సింలు, మైసయ్య, ఉద్దర హనుమాన్లు, రోహిత్, దేవారం సాయి రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.